Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-వనస్థలిపురం
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు గడుస్తున్నా బీసీలకు ఇంతవరకు రుణాలు ఇవ్వలేదనీ, బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్,కృష్ణయ్య అన్నారు. శుక్రవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఉందా లేదా అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అన్ని కార్పొరేషన్లు సక్రమంగా నడుస్తున్నా బీసీ కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు నిర్వీర్యం చేసిందో తెలియటం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్స్‌కు సొంత బిల్డింగ్స్ లేవవీ, ఎన్నికల ముందు 5 లక్షల 75,000 మంది దరఖాస్తులు రుణాల కోసం పెట్టుకుంటే ఇంతవరకు ఎవరినికీ రుణాన్ని మంజూరు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వాన్ని షూరిటీ ఇవ్వమంటే ఇవ్వటం లేదన్నారు. బీసీ వెల్ఫేర్ కింద 200 హాస్టల్స్, 190 గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయనీ, ఒక్క దానికి కూడా సొంత బిల్డింగ్ లేదన్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులకు సొంత బిల్డింగులు ఏర్పాటు చేసి తమ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఇకనుంచి బీసీలను దృష్టి లో పెట్టుకోకుంటే మనుగడ సాగదు అని హెచ్చరించారు.