Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ఆన్లైన్ బెట్టింగుకు అలవాటు పడి చైన్ స్నాచింగ్ చేసి పరారైన ఇద్దరు నిందితులని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారా న్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంకి చెందిన పులిపాటి కిరణ్ మెడికల్ షాప్‌లో ఉద్యోగం చేస్తూ హయత్‌నగర్ మండలం తొర్రూర్ రోడ్డు ఇంజా పూర్ తిరుమలనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మరో నిందితుడు రంగారెడ్డి జిల్లా చేరుకొండ గ్రామానికి చెందిన సిద్ధ మోని నరేందర్ వృత్తిరీత్యా డెలివరీ బారు. రెంబో హై స్కూల్ సంతోష్ మాత లైన్ హస్తినాపురంలో నివసిస్తున్నాడు. ఇద్దరు నిందితులు ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అధికంగా డబ్బులు సంపాదించాలనే వ్యామోహంతో ఈనెల 26వ తేదీన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్యలక్ష్మి నగర్‌కు చెందిన నర్సమ్మ ఇంటి నుంచి బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనంపై తలకు హెల్మెట్లు ధరించి నరసమ్మ మెడలోని 30 గ్రాముల బంగారు గొలు సును ఎత్తుకెళ్లారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహ నం, రెండు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని రిమాండ్‌కి తరలించినట్టు తెలిపారు. చాకచ క్యంగా నిందితుల్ని పట్టుకున్న మీర్‌పేట సీఐ మహేందర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, టీఎస్ఐ రాజేష్, ఎస్సై రాథోడ్, హెడ్ కానిస్టేబుల్ పీఎన్ కరణ్, కె.శేఖర్, కానిస్టేబుల్స్ ఎల్లయ్య, శివరాజ్, మణిపాల్ అనిల్, నవీన్, విజరు కుమార్ రెడ్డిలకు ఏసీపీ పురుషోత్తం రెడ్డి రివార్డులను అందజేసి అభినందించారు.