Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిది కార్పొరేటర్ చుక్క శివకుమార్, మహే శ్వరం నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్‌గౌడ్ అన్నారు. గురువారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మామిడిపల్లి 11వ డివిజన్‌కు చెందన శ్రీమంతుల నరేందర్ గౌడ్, బాషమ్మ, గోపాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయంను కార్పొరేటర్ శివకుమార్, నిమ్మల నరేందర్ గౌడ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకె ళ్లారు. దీంతో మంత్రి సీఎం సహాయ నిధి పథకం నుంచి శ్రీమంతుల నరేందర్ గౌడ్‌కు రూ.60వేలు, బాషమ్మకు రూ.37వేల ఐదువందలు, గోపాల్‌కు రూ.2500 మంజూరు చేయించగా.. ఆ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల, వెనుకబడిన కుటుంబాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతో మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నుంచి రూ.కోట్లు మంజూరు చేయించి, ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఎంతో మంది పేద ప్రజలను ఆదు కుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఖిల్, నవీన్, శేఖర్, వీరేందర్ పాల్గొన్నారు.