Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
బడుగు బలహీన వర్గాల, దళిత, గిరిజన, మైనార్టీ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేలు జరిగిందని టీపీసీసీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ పరిధిలోని ఏకలవ్య నగర్ కాలనీలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు బుడ్డా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరుకల సంఘం పతకాన్ని ప్రభాకర్‌రెడ్డి ఎగరేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాంతంలోని ఎరుకల కులస్తులు ఎస్టీ జాబితాలో ఉండగా, తెలంగాణ ప్రాంతం లోని ఎరుకల కులస్తులు సంచార జాతులుగా వున్నా వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఎరుకల కులస్తుల పోరాటానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ స్పందించి తెలంగాణ ప్రాంతంలోని ఎరుకల కులస్తుల స్థితిగతులపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. 1976 సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ ప్రాంత ఎరుకల కులస్తులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చుతూ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నిర్ణయాన్ని తీసుకున్నారని గుర్తు చేశారు. అప్పటివరకు బీసీ జాబితాలో కొనసాగుతూ అభివృద్ధికి దూరమైన ఎరుకల కులస్తులు, ఎస్టీ జాబితాలో చేరడం ద్వారా రాజ్యాంగ ఫలాలను విరివిగా అనుభవించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నల్లగొండ శ్రీను, బాన్నపురం రఘు, శేఖర్, సుల్తాన్ వెంకట్, సెద్దిని స్వామి, వెలుగు నాగార్జున, చిన్న నరసింహా, ఎరిగి రమేష్, శ్రావణ, తదితరులు పాల్గొన్నారు.