Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
హమాలీ రంగారెడ్డి జిల్లా ఫెడరేషన్ జిల్లా మహాస భలు ఆటోనగర్‌లోని టీసీఐ ఫైట్ ఇండియా లిమిటెడ్ వద్ద ఎం.వీరయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. నేడు వివిధ రంగాల్లో పని చేస్తున్న హమాలీ వర్కర్స్‌కి సమగ్ర రక్షణ చట్టం చేయాలనీ, ప్రతి కార్మికుడికీ రూ.15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో జీవనం సాగించడం కడుభారంగా మారిందన్నారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న మమాలీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలనీ, దసరా దీపావళి సందర్భంగా బోనస్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాలను డిమాండ్ చేశారు. ఈ మహాసభలలో హమాలీ సంక్షేమ ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్మికులకు రక్షణ కల్పించాలనీ, ప్రభుత్వం ద్వారా ప్రతి హమాలీ కార్మి కుడికి రూ. 15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవోలను సవరించి పెంచాలి ఏకగ్రీవంగా తీర్మానించారు. అనం తరం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.వీర య్య, పెండ్యాల బ్రహ్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. సభ్యులుగా రాజకుమార్ దయానంద్, సింహాద్రి, అంజ య్య, బుచ్చమ్మ, పోచయ్య, మసూద్వెం, కట్రావు కృష్ణ సీహె చ్ శ్రీను పెంటయ్యను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీసరి నర్సిరెడ్డి, అలేటి ఎల్లయ్య, భాస్కర్, చిన్న అంజయ్య పాల్గొన్నారు.