Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల నిర్వహణ ఉండాలి : మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్యం అందేలా ప్రయివేట్ ఆస్పత్రుల నిర్వహణ ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమలా హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సదుపాయం కల్పిస్తూనే అందుబాటు ధరలలో సేవలు అందించాలన్నారు. అనంతరం ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ అశాలత అశోక్ మాట్లాడుతూ.. ఆస్ప త్రి నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గర్భిణు లకు ఓపీ సేవలు కేవలం రూ.100కే అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అశోక్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, పీర్జాదీగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్ అలువాల సరితా, సినీ నటులు శ్రవణ్ రాఘవేంద్ర, ప్రశాంత్, సీని డైరెక్టర్ కొత్తపల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.