Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
- టీకేఆర్ కాలేజీలో బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ-మీర్ పేట్
దేవుళ్లను పూలతో కొలుస్తాం.. కానీ ఆ దేవున్ని కొలిచే పువ్వులనే మనం పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నా రు. శుక్రవారం మీర్పేట్లోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలను ఎలా భాగ స్వామ్యం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో, భారత స్వాతంత్యో ద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలో తిలక్ పండుగలలో ప్రజలను మమేకం
చేసి ఉద్యమం వైపు నడిపించిన ఆలోచన గుర్తుకొచ్చింద న్నారు. ఈ ఆలోచనతో బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్య మంలో మరింత విస్తృత పరిచామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగలో యువతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ప్రపంచం లో ఎక్కడా లేని సంస్కతి తెలంగాణలో ఉందన్నారు. పెద్ద ఎత్తున టీకేఆర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో ఉద్యమ కాలం రోజులు గుర్తొకొస్తున్నాయని చెప్పారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, విద్యార్థులతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీకేఆర్ విద్యాసంస్థల చైర్మెన్ తీగల కృష్ణారెడ్డి, మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, కార్యదర్శి తీగల హరినాథ్ రెడ్డి, కోశాధి కారి తీగల అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ జాగతి జిల్లా అధ్యక్షురాలు అర్చన, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.