Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
చిన్నపాటి వర్షానికే తుర్కయంజల్ మున్సిపాలిటీలోని కమ్మగూడ 18వ వార్డులోని రోడ్డు జలమయంగా మారుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం.. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ రోడ్డు మీద నుంచి వార్డులో నివాసం ఉండే వారు తమ పిల్లలకు ద్విచక్ర వాహనంపై స్కూల్కు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నుంచి స్కూల్ పిల్లలలతోపాటు, ఉద్యోగులు కూడా ఆఫీసులకు వెళ్తుంటారు. ప్రస్తుతం రోజూ కురుస్తున్న వర్షాల కార ణంగా రోడ్డంతా బురదమయంగా మారడంతో ద్విచక్రవా హనదారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెడ్డు వెంటే 6, 7 కాలనీ ప్రజలు సైతం రాకపోకలను సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు నీరు నిల్వకుండా బురదగా మారుతుండటంతో ఎక్కడ జారి కింద పడు తామో అని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.