Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు ఒకనెల వేతనాన్ని దసరాపండుగ సందర్భంగా బోనస్‌గా చెల్లించాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాచుపల్లి, అలీప్ పారిశ్రామిక ప్రాంతంలో సర్వే నిర్వహించారు. కార్మికులకు బోనస్ చెల్లించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విషయం సర్వే సందర్భంగా తెలిసిందన్నారు. బాచుపల్లి ఆలీప్ ఇండిస్టియల్ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు సుమారు 180 వరకు ఉన్నాయన్నారు. వీటిలో పర్మినెంట్, కాంట్రాక్టు, డైలీ వేజ్, క్యాజువల్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులందరికీ 2020 - 2021 సంవత్సరానికి కనీస బోనస్‌గా ఒకనెల వేతనం చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోందన్నారు. పరిశ్రమల లాభనష్టాలతో సంబంధం లేకుండా కార్మికులకు బోనస్ చెల్లించాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. కానీ యాజమాన్యాలు కార్మికులకు బోనస్ చెల్లించకుండా బహుమతుల పేరుతో రూ. 2 వేలు, 3 వేలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. కొన్ని కంపెనీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. పర్మినెంట్, ఇతర కార్మికుల పని సమానం అయినప్పటికీ వారికిచ్చే వేతనాల్లో, బోనస్‌లో వివక్ష చూపటం తగదన్నారు. కార్మికుల శ్రమతో ఇబ్బడి ముబ్బడిగా ఆర్జించిన లాభాలలో వారికి కేవలం శ్రమశక్తికి మాత్రమే కూలి కట్టిస్తున్నారని తెలిపారు. కార్మికులు శ్రమించి సష్టించిన సంపదలో బోనస్‌గా కనీసం ఒకనెల వేతనం పొందడం కార్మికుల హక్కు అని ఉద్ఘాటించారు. కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యాల లాలూచీతో కార్మికులకు బోనస్ చెల్లించకుండా మోసం చేస్తున్నారన్నారని విమర్శించారు. వెంటనే సంబంధిత లేబర్ అధికారులు తగిన చర్యలు తీసుకుని పర్మినెంట్, కాంట్రాక్ట్, క్యాజువల్, డైలీ వేజ్ అనే భేదం లేకుండా కార్మికులందరికీ ఒక నెల వేతనాన్ని బోనస్‌గా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ బాచుపల్లి పారిశ్రామిక ప్రాంత కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుధాకర్, సురేష్, శ్రీను, స్వామి తదితరులు పాల్గొన్నారు.