Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమల్లేశ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ మండలంలో భూ కబ్జాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్ కోరారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నా వాటిని కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలం అవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్ విమర్శించారు. శుక్రవారం ప్రభుత్వ భూములు పరిరక్షించాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాలమల్లేశ్ మాట్లాడుతూ.. అన్యాక్రాంతం అవుతున్న భూములపై దృష్టిపెట్టి వాటిని స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో డబుల్‌బెడ్ రూం ఇండ్లు కట్టి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇస్తేనన్న ప్రయోజనం ఉంటుందని, లేకుంటే ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ కబ్జాదారులు వాలిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. తక్షణమే గాజులరామారంలోని సర్వే నెబర్లు 329,307,342 లలో ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు.సీపీఐ జిల్లా కార్యదర్శి డిజి. సాయిలు గౌడ్ , జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహ, వెంకటాచారి, సహదేవ్, మండల నాయకులు సాయిలు, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి , శ్రావణ్ , ఉపేందర్ లు పాల్గొన్నారు.