Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీల) సమస్యలు వెంటనే పరిష్కారించాలని క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగుల క్రిష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు సంతోష్ కుమార్, రాష్ట్ర కోశాధికారి యాసరపు వెంకన్న, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్తకాపు శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టునాయక్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తూ అర్హత, ఆసక్తి ఉన్న సీఆర్పీలకు రీ-డిప్లారుమెంట్ అవకాశం కల్పించాలని, రవాణా భత్యం, ఫోన్ బిల్లులు చెల్లించాలన్నారు. పీఎఫ్, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలనీ, 2012లో కలెక్టర్ చైర్మెన్‌గా జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా నియామకం అయ్యామని, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సీఆర్పీలకు 30శాతం వెయిటేజీ ఇవ్వాలన్నారు. మహిళ సీఆర్పీలకు 6 నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనీ, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పనిచేస్తున్న వారికి బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న.. పరస్పర అంగీకారంతో బదిలీలకు అవకాశం కల్పించాలని వారు కోరారు.