Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బాలకిష్టా రెడ్డి
నవతెలంగాణ-శామీర్ పేట
మానవ జీవితంలోస్వచ్ఛత ఎంతో ముఖ్యమని నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకారం చుట్టిన స్వచ్ఛ శామీర్ పేటలోని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయయంలో శుక్రవారం అధ్యాపకులు సామాజిక బాధ్యతలో భాగంగా స్వచ్ఛ నల్సార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ... స్వచ్ఛత అనేది మానవ వ్యక్తిగత జీవన శైలిలో ఎంతో ముఖ్యమైనది అన్నారు. శుబీ శుభ్రత అనేది మానవ మనుగడకు కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. నల్సార్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విస్తృత పరిచి స్వచ్ఛ నల్సార్ లక్ష్యంగా విద్యార్థులను, అధ్యాపకులను , సిబ్బంది అందరినీ మమేకం చేయడం జరిగిందన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, నల్సార్‌లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వినూత్నంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్సార్ అధ్యాపకులు డాక్టర్ మల్లికార్జున్, శివ చరణ్, విద్యార్థులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.