Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెరపివా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో ఎస్.కె.భాషా, వి. అమర్నాథ్ రెడ్డి 26 ఏండ్లుగా పనిచేశారు.అయితే ఎటువంటి కారణం లేకుండానే యాజమాన్యం వీరిని తొలగించింది. అయితే తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవీ యాజమాన్యం ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన రవిసింగ్ యాజమాన్యంతో మాట్లాడి ఎస్.కె భాషాకు రావాల్సిన రూ. 8,50,000/-, వి. అమర్నాథ్రెడ్డికి రావాల్సిన రూ.5,50,000 నగదును ఇప్పించారు. దీంతో కార్మికులు కార్మిక నాయకుడు రవిసింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో శ్రీనివాసచారి, సంతోష్‌గౌడ్, మనోజ్ కుమార్, అశోక్ చారి తదితరులు పాల్గొన్నారు.