Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
మేడ్చల్‌జిల్లా దూలపల్లిలోగల తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో రాష్ట్రంలోని 31వ బ్యాచ్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 30న ముగిసింది. మొత్తం 55 మంది బీట్ అధికారులు శిక్షణ పొందగా ఇందులో 14 మంది మహిళా అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎస్ఎ నాగినీ భాను కార్యక్రమ రిపోర్టును సమర్పించారు. పాసింగ్ఔట్ పరేడ్‌ను తనిఖీ చేసిన అనంతరం జరిగిన స్నాతకోత్సవ సమావేశంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను ఆయా విషయాలలో ప్రతిభను కనబరచిన అధికారులకు బంగారు పతకాలను, ప్రశంస పత్రాలను అందజేశారు.
ఖమ్మం అటవీ డివిజన్‌కు చెందిన కె.అనూష అత్యుత్తమ ప్రతిభను కనబరచి 82 శాతం మార్కులతో బ్యాచ్ టాపర్‌గా ఆల్ రౌండర్‌గా నిలిచి, మొత్తం (4) బంగారు పతకాలను సాధించారు. పి. మధుసూదన్ బంగారు పతకాలను, ఎం శ్రావణ్ కుమార్, ఆర్. శ్రీనివాస్, బి. రాజశేఖర్, బి. చిన్న, ఆర్. ప్రశాంత్, బి. ఝాన్సీ రాణి. వివిధ విభాగాలలో ఒక్కొక్క బంగారు పతకాన్ని పొందారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, రాజారావు శిక్షణ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని, నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని, పరిస్థితుల నుండి కొత్త విషయాలను నేర్చుకుంటూ వత్తిని సమర్థవంతంగా నిర్వహించి అడవులను కాపాడాలని అన్నారు. వ్యక్తిగత చదువు అర్హతలను పెంచుకోవడానికి కషి చేయాలని కోరారు. ప్రత్యేక అతిథిగా జి. రవీందర్, విశ్రాంత అటవీ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ అకాడమీ అదనపు డైరెక్టర్ ముఖ్య సంరక్షణాధికారి ఎస్. రమేశ్, అకాడమీ సంయుక్త డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డెరైక్టర్లు గంగారెడ్డి, ఆంజనేయులు, రామ మోహన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.