Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారనీ, ఆయన అభీష్టం నెరవేరుతుందని రాష్ట్ర కార్మిశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నా రు. బోయిన్పల్లి టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మంత్రి దర్శిం చుకుని మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని నేతగా ఎదుగుతారని పేర్కొన్నారు. దేశమంతటా ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆతృతగా చూస్తోందని తెలిపారు. పాండవు లు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆయుధాలు తీసుకుని కౌరవులతో యుద్దానికి వెళ్లారనీ, అలాగే సీఎం కేసీఆర్ దసరా విజయదశమి నాడే ఈ జాతీయ పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభసూచకమన్నారు. ఈ సందర్భంగా మంత్రిని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ సన్మానించారు.