Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్, గోదావరి హౌమ్స్లో ''అగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్'' నయువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కే.పీ. విశాల్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ సుమారు 750 సభ్యులు గల అగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్ ఇదివరకే నాలుగు అగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్స్ జీడిమెట్ల గ్రామం, కండ్ల కొయ్య, సుభాష్ నగర్, భాగ్యలక్ష్మి నగర్ కాలనీలో ఉండగా ఇది ఐదోది అన్నారు. గతంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి లోని ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కాపాడి, వాటిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వారి అభీష్టం మేరకు మందిరాలను నిర్మించినట్టు తెలిపారు. కైసర్ నగర్, సూరారం, కళావతి నగర్లలో, అనేక చోట్ల ప్రార్థన మందిరాలను చర్చిలను నిర్మించినట్టు తెలిపారు.అగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్ చర్చి నిర్మాణానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్ సభ్యులు ఐక్యమత్యంతో కలిసి మెలిసి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ కార్యక్రమంలో 130వ డివిజన్ మాజీ కార్పొ రేటర్ సురేష్ రెడ్డి, భాగ్యలక్ష్మి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సాగర్ రెడ్డి, నల్ల ప్రశాంత్ గౌడ్, వెంకటేష్, కిరణ్ రెడ్డి, ఆగాపే ప్రేయర్ హౌస్ ఫౌండేషన్ మందిర, ప్రతిష్ట ప్రార్ధన కూడిక వ్యవస్థాపకురాలు పి.చంద్రావతి, సునీత, స్టాన్లీ, కరుణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.