Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ తిరుమలగిరి లాలామియా బస్తీలో ఏర్పాటైన వస్త్ర ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. నిర్వాహకులు విశాల్ జైన్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన 10 రోజుల్లో ప్రజల ఆదరణ పొందుతు న్నామని తెలిపారు. ప్రతి 5000 కొనుగోలుపై ఒక సిల్వర్ కాయిన్ ఉచితంగా బహుమతిగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అష్టకళాకారులకు ఆదుకునేందుకు ఇక్కడ ఈ ప్రదర్శనను నెలరోజుల పాటు నెలకొల్పామని పేర్కొన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. వస్త్ర ప్రదర్శనలో దేశంలోనే పలు రాష్ట్రాలకు చెందిన విభిన్న చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా పట్టు చీరలు, ఖాదీ బట్టలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్తువులు సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. కొన్ని రోజులగా దసరా పండుగకు సెలవులు ఇవ్వడంతో ఉద్యోగులు, గృహిణులు సాయంత్రం వేళలో షాపింగ్ చేయడంతో ఎగ్జిబిషన్ కిటకిటలాడు తోంది. 5000 షాపింగ్ చేసిన వారికి ఒక సిల్వర్ క్వాయిన్ కానుకగా ఇస్తునట్టు నిర్వాహకులు ప్రకటించడంతో వినియోగదారుల కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదర్శన నవంబర్ 6వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వికాస్ జైన్ తెలిపారు.