Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని దాసరి బస్తీలో జరుగుతున్న కొత్త హంగులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఏఈ రషీద్‌తో కలిసి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించుకుని ప్రజాభీష్టానికి అనుగుణంగా సమస్యలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, ప్రధానంగా వార్డు కమిటీ సభ్యులు ప్రజలకు ఎక్కడ ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే సమక్షంలో అధికారులతో పరిష్కరింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, నేమూరి బాలేష్, సాయిబాబా పాల్గొన్నారు.