Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ హబ్‌పై రూ.1800 కోట్లు ఖర్చు
- జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆవిష్కర్తలను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందు ఉంటుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. స్టార్టప్ హౌస్ అంతర్జాతీయ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ చొరవ, టీఐటీఏ (తెలంగాణ ఐటీ అసోసియేషన్) దశాబ్ది వేడుకలు టీ-హబ్‌లో జరిగాయి. స్టార్టప్ హౌస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఫండింగ్ షో. ఇది ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు హెచ్ఎంటీవీలో ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు మంచి మార్పుకోసం పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, స్టార్టప్‌లను పెంచడానికి టీ-హబ్‌పై రూ.1800 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇప్పుడు తెలంగాణ ఐటీ ఎగుమ తుల్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. స్టార్టప్ హౌస్ స్టార్టప్ ఐడియా ఫండింగ్ చొరవతో వస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నాననీ, యువ ఆలోచనలకు సహాయప డుతుందని తెలిపారు. స్టార్టప్ హౌస్ వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పెట్టుబడిగా డబ్బు జోడిం చబడే వరకు ఐడియా ఒక ఆలోచనగా ఉంటుందన్నారు. ఇక్కడ తాము తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్లాట్‌ఫారమ్ ద్వారా కొత్త స్టార్టప్ ఆలోచనలు, స్టార్టప్‌లను పెంచబోతున్నా మని తెలిపారు. స్టార్టప్‌లు, యువ ఔత్సాహికులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆడిష న్లు, టీవీ షోలలో చురుకుగా పాల్గొని గొప్ప ఆలోచనల ను ప్రదర్శించడానికి, సంపన్నమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సన్నద్ధం చేయడానికి / స్కేల్ అప్ చేయడానికి నిధులను గెలుచుకోవాలని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 842 దరఖాస్తులు పొందినట్టు తెలిపారు. క్రిష్ చింతలూరి ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు/అధ్యక్షుడు, సందీ ప్ మక్తాల ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతుగా ఎంఓ యూను మార్చుకున్నారు. లాంచ్‌లో భాగంగా కొన్ని స్టార్ట ప్ ఆలోచనలను యువ ఆవిష్కర్తలు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఆప్టిమస్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీఐటీఏ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల, స్టార్టప్ హౌస్ ప్రమోటర్లు వినోద్ కుమార్ పెంటకోట, క్రిష్ చింతలూరి, జ్ఞానేశ్వర్, వెంకట రమేశ్ సుంకర, ప్రసన్న లక్ష్మీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, వెంచర్ క్యాపి టలిస్టులు, ఈక్విటీ మేనేజ్మెంట్ ఫండ్లు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.