Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకులు ఏకే గోపాలన్ 118వ జయంతి సందర్భంగా పార్టీ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఆఫీసు కమలానగర్లో నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి పి.సత్యం, కార్యద ర్శివర్గ సభ్యులు కోమటి రవి, జిల్లా నాయకులు ఉన్నికృష్ణన్, సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడారు. కేఎన్ గోపాలన్ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ప్రారంభిం చిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారని తెలిపారు. ఆలయాల్లో దళితుల ప్రవేశం కోసం దీర్ఘకాలం కొట్లాడి విజయం సాధించారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ విలువలను రక్షించుకుంటూ కమ్యూనిస్టు సిద్ధాంతాల కనుగుణంగా కేరళలో పార్టీ నిర్మించడంలో ప్రముఖ భూమిక నిర్వహించారని చెప్పారు. ప్రజలను చైతన్య పరచ డంలో ప్రజల్లో భాగస్వామ్యమై ప్రజల్లో మమేకమై నిలిచిన వారిలో అగ్రగణ్యులని చెప్పారు. పార్లమెంటేరియన్‌గా కూడా పనిచేసే ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీని తూర్పూర పట్టారన్నారు. ప్రజా జీవితంలో ఆదర్శంగా జీవించి అనేక పోరాటాలలో నిబద్ధతతో పోరాడి ప్రజలకు అనేక విజయాలను చేకూర్చారనీ, దాని ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నేటికీ బలంగా నిలబడి ఉండ టానికి ఆయన వేసిన పునాదులు ముఖ్యమని చెప్పారు. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక పర్యాయాలు జైలు జీవితాన్ని అనుభవించా రనీ, ప్రజా జీవితంలో ఆయన మమేకమై ఆదర్శమైన కృషి చేశారని చెప్పారు. దాదాపు ఏడుసార్లు పార్లమెంట్ సభ్యుడి గా ఉండి ప్రజలకు తనదైన ముద్రలు వేసి పోరాట స్ఫూర్తి ని ఇచ్చారని చెప్పారు. సమావేశానికి సీనియర్ నాయకులు యాదగిరి రావు అధ్యక్షత వహించారు. అనంతరం సభ్యు లందరూ ఏకే గోపాలన్ చిత్రపటానికి పూలను అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, ఎన్.శ్రీనివాస్, ఆర్ఎస్ఆర్ ప్రసాద్, శ్రీనివాసరావు, బసవ పున్నయ్య, బ్యాగరి వెంకటేష్, గౌస్య, శోభ, అంజలి, తదితరులు పాల్గొన్నారు.