Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ సేవాధికార సంస్థ చైర్మెన్ హరికృష్ణ భూపతి
నవతెలంగాణ-సరూర్నగర్
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకో వాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మెన్ హరికృష్ణ భూపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీలలో అన్ని బ్యాంకులకు సంబంధించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మెన్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులను నోటీసు ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పిలిపించడం జరిగింది. కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోమని తెలియజేశారు. మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ తిరుపతి మాట్లాడుతూ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న కక్షి దారులకు సివిల్ స్కోర్ పెరిగే విధంగా చూడాలని బ్యాంక్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా ఖాతాదారులు వారి రుణాలను చాలా వరకు పరిష్కరించుకోగలిగారు.ఈ బ్యాంకు లోక్ అదాలత్లో 113 బ్యాంక్ పిఎల్సిఎస్ కేసులు పరిష్కరించబడ్డాయి. ఖాతాదారుల నుండి ఈ రుసుము రూ.98,36,517లబ్ధి పొందడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.శ్రీదేవి, రంగారెడ్డి జిల్లా బార్ ప్రెసిడెంట్ జి.సుధాకర్ రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ ప్రకాష్ బాబు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె.రాజాశ్రీ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.