Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యం.ధర్మనాయక్
నవతెలంగాణ-సంతోష్‌నగర్
గత 8సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ లో గిరిజనులకు రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచు తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలం గాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.ధర్మనాయక్ అన్నారు. శనివారం సంతోష్‌నగర్ ప్రధాన కార్యాల యంలో సమావేశంలో గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచడం గిరిజనులు సాధించిన గొప్ప పోరాట విజయ మని, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గిరిజన రిజర్వేషన్ సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పోరాట విజయంతో పొంగిపోకుండా ఐక్య ఉద్యమా లతో గిరిజన సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నామన్నారు. గత 8 సంవత్సరాల పాటు గిరిజనులు సాగించిన పోరాటాల ఫలితంగానే తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచుతూ జీవో 33ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలునాయక్, రాష్ట్ర నాయకులు ఆర్.శేఖర్‌నాయక్, జె.అరుణ్‌నాయక్, ఎరుకల ప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.రఘు నాయక్, ఎ.కృష్ణా నాయక్. ఎస్.కిషన్ నాయక్, శ్రీరాం నాయక్‌లు సమావేశంకు హాజరయ్యారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం జీవో జారీ చేయడంతోపాటు తక్షణం ఈరోజు నుండే అమలు చేస్తున్నట్లు ప్రకటించ డంపట్ల సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. సాధించిన పోరాట స్ఫూర్తితో గిరిజన హక్కుల కోసం మరిన్ని ఉద్యమాలకు సిద్ధపడదామని, అందుకు కలిసి వచ్చే గిరిజన సంఘాలతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కోసం తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు.