Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి తీరుతాం
- చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
గ్రంథాలయ పాఠకుల సమస్యలను పరిష్కారం చేసి త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి తీరుతామని రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్లో మున్సిపల్ కార్పొరేషన్‌లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.మనోజ్‌కుమార్ అధ్యక్షతన పాఠకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిóగా హాజర య్యారు. అనంతరం ఈ సమావేశంలో పాఠకుల సమస్యలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. పాఠకులు ఇక్కడ సదుపా యాలు చాలా బాగున్నాయని, జనరల్ పుస్తకాలు త్వరగా అందుబాటులోకి తేవాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిóగా హాజరైన సంస్థ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి పాఠకులు అడిగిన వాటికి స్పందిస్తూ త్వరలోనే జనరల్ పుస్తకాలు ఖరీదు చేసి మీకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటానికి టెక్నీషియన్‌ను పిలిచి మాట్లాడి సౌకర్యం కల్పించేలా చూస్తామని అన్నారు. పాఠకులు ఈ భవనం తమదిగా భావించి తమ గుర్తుగా వీలైనవారు మీకు ఇష్టమున్న మొక్కలు నాటాలని చైర్మెన్ పాఠకులను కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.