Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మీర్పేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందే చెరువుకట్టపై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చీరల్లో కేసీఆర్ అభిమానం, చిరు కానుకగా భావించి నేతన్నల కష్టం చూడాలని, నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నా యన్నారు. సంవత్సరం మొత్తం దేవుణ్ణి పువ్వులతో పూజిస్తే అదే పువ్వులను 9రోజులు పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఇంత అవకాశం కల్పించినందుకు మహిళల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మహిళ లు ఆడుకునే ఆట బతుకమ్మ అని పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలకు ట్యాంక్‌బండ్ ఎలా మూసివేస్తారో అలానే జిల్లెలగూడ చందన చెరువు కట్టను మూసి ఆడుకోవాలని మహిళలకు సూచించారు. ప్రతి గల్లిగల్లీలో ఎక్కడ చూసిన బతుకమ్మ ఆడుతూ పువ్వులను గౌరవించే సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, మేనేజర్ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపిపి సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.