Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్
- ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిబిరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రక్తదానం ప్రాణదానంతో సమానమని జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం ఏసీపీ జి.శంకర్రాజు నేతృత్వంలో తలసేమియా బాధిత చిన్నారులకు రక్తదానం, ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని బేగంపేటలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 109 మంది పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడారు. కర్తదానం చేయడం గొప్పవిషయమన్నారు. రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ప్రాధాన్యత తెలుసుకుని ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం శిబిరాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ శంకర్రాజుతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరిని జాయింట్ సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సీఐ జీ.నాగరాజు, ఎస్ఐ జ్యోతి, వారి బృందంలోని సుమన్, కృష్ణ, రాజేష్, శ్రీనివాసరావు, వీరమ్మ పద్మావతి, పద్మ, రాజేశ్వరరావుతోపాటు ఇండియన్ రెండ్క్రాస్, మారేట్పల్లి లయన్స్క్లబ్, మన్సురాబాద్లోని నిరంజన్ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.