Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్
- ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి భావితరాలకు ఆదర్శనీయులని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ డీఎస్. లోకేష్‌కుమార్ మాట్లాడుతూ ఆంగ్లేయులు పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన నాయకులలో గాంధీ అగ్రగణ్యుడు అన్నారు. సత్యం, అహింస గాంధీ సిద్ధాంతాలు అని, సత్యాగ్రహం, సహాయ నిరహకరణ లాంటివి ఆయుధాలన్నారు. కులాలు, మతాలు అన్ని ఒకటేనని చాటి చెప్పిన మహనీయుడని, ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలను కషి చేయడమే కాకుండా ఆదర్శంగా తీసుకోవాలని కమిషనర్ సూచించారు. స్వాతంత్య్రోద్యమంలో లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రముఖ పాత్ర పోషించారని, దేశ రెండో ప్రధాన మంత్రిగా పని చేసి 'జై జవాన్- జై కిసాన్' నినాదం ప్రస్తుత కాలంలోనూ ప్రజల హదయాల్లో గుర్తుండిపోయిందన్నారు. భారతదేశ ప్రజలకు కావాల్సిన ఆహార అందించేందుకు ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ వ్యవసాయ విప్లవానికి గ్రీన్ రివల్యుషన్, పాలఉత్పత్తి పెంచేందుకు వైట్ రివల్యూషన్‌ను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అన్నారు. దేశ ఆర్థిక, సాంఘిక పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కషి చేసినట్టు కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియాఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు విజయలక్ష్మి, యాదగిరిరావు, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వకీల్, సీపీఅర్ఓ మొహమ్మద్ ముర్థుజా, పీఅర్ఓ జీవన్ పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో నివాళి
మహాత్మ గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, సేవారత్న డాక్టర్ ఎస్.ఎం.హుస్సేనీ(ముజీబ్), వారి కార్యవర్గంతో కలిసి అదివారం గృహకల్పలోని సంఘం కార్యాలయంలో ఘనంగా నివాళులుర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ వీరిద్దరూ గొప్ప దేశ భక్తులు, స్వతంత్ర సమరయోధులు దేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అహింస సిద్ధాంతం పాటిస్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడి సాధించారని, వారి సిద్ధాంతాలు ప్రజలలో క్షమాగుణం పెరిగేలా చేసిందన్నారు. వారి మార్గదర్శములో దేశం లౌకిక దేశంగా పేరు తెచ్చుకున్నదనీ, తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా విస్తరించాయని..వారి ఆశయాలని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్, కె.శ్రీనివాస్, నాల్గవ తరగతి సంఘ సహా అధ్యక్షుడు ఎం.ఏ.ముజీబ్, పీఆర్వో జహంగీర్ అలీ, ఏపీఆర్వో ఎండీ వహీద్, ముహమ్మద్ ముస్తఫా, ప్రిథ్వి, జాఫ్రీ, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని అదివారం అంబర్‌పేటలో ఉన్న గాంధీ విగ్రహానికి డ్రగ్ ఫ్రీ వరల్డ్ ఇండియా జూనియర్ అంబాసిడర్ తానియా బేగం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అబిడ్స్‌లోని డీఈవో కార్యాలయంలో
మహాత్మాగాంధీ 153వ జయంతి పురస్కరించుకొని అదివారం అబిడ్స్‌లోని డీఈవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఎన్జీవో స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో
బాలానగర్: వర్ధమాన దేశాల చరిత్రలను ప్రభావితం చేసిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారతీయులందరిచే ఆదరింపబడే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ అని, ఆయన్ను ప్రజలు జాతిపితగా గౌరవిస్తారని అన్నారు. విశ్వమానవాళికి శాంతి, అహింసా సిద్ధాంతాలను ప్రబోధించి అవి మాత్రమే సుఖంగా, సంతోషంగా, స్థిరంగా ఉంచగలవని సందేశాన్నిచ్చి అనేక వర్ధమాన దేశాల చరిత్రలను ప్రభావితం చేసిన మహోన్నతుడని కొనియాడారు. ఎలాంటి రాజకీయ పదవులను ఆశించకుండా ప్రజా సేవకుడిగా చరిత్రలోమిగిలిపోయారన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో..
ఓయూ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కెఎస్. శిల్పాచారి ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మొహమ్మద్ హుస్సేన్, విజయ్, గీత, జాకీర్, శ్రీనాథ్, పద్మజ, రాజ్యం, భాస్కర్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ రెండు బొమ్మల సెంటర్ వద్ద స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహమ్మద్ లియాకత్ అలీ, నాగరాజు, జ్ఞానేశ్వర్, జావీద్, కిషోర్ ,వినోద్, ఆండాలమ్మ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంబర్‌పేట: మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని అంబర్‌పేటలోని గాంధీ విగ్రహానికి విజరు కుమార్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. యువత మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనిస్తూ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెహదీపట్నం: సీపీఐ (ఎం) నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లేష్, ఆవాజ్ అధ్యక్షుడు ఆలీ మెహదీపట్నంలో మహాత్మునికి ఘనంగా నివాళి అర్పించారు.
జగద్గిరిగుట్ట: దేశ స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని బాపూజీ హైస్కూల్ చైర్మెన్ కరస్పాండెంట్ నవ్వ ప్రభాకర్ రావు అన్నారు. ఆదివారం గాంధీజీ జయంతి పురస్కరించుకొని జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లోని బాపూజీ స్కూల్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఎం. శ్రీనివాస్ ముదిరాజ్, దుర్గాప్రసాద్ ముదిరాజ్, నర్సింగ్ పాల్గొన్నారు.