Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్జగద్గిరిగుట్టహిమాయత్నగర్
బతుకమ్మ పండుగ గొప్పదనం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమనీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళా విలేకరులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని సంస్కతులకు సంప్రదాయలాకు చిరునామాగా నిలుస్తుందని వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని పశ్నించారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాధించి ఏర్పడిన కొన్ని సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో
సీపీఐ గ్రౌండ్స్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉజ్జిని హైమావతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాహలంగా బతుకమ్మ పాటలపై కోలాటం ఆడారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర నాయకులు యేసురత్నం హాజరై మాట్లాడుతూ బహుజన బతుకమ్మను జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కులలాకతీతంగా ప్రకృతి పూల పండుగ బతుకమ్మ అన్నారు. అనంతరం భారత జాతీయ మహిళా సమాఖ్య కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు ఉజ్జిని హైమావతి మాట్లాడుతూ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో అని గద్దెనెక్కి ప్రస్తుతం మహిళలకు కనీస రక్షణ లేకుండా జాత్యహంకార వాదులకు కొమ్ము కాస్తూ మహిళా రక్షణ విధానాలను పాతేరేసే విధంగా వారి పాలన ఉందని విమర్శించారు. దేశంలో ప్రతినిత్యం ఏదొకచోట మహిళలు, బాలికలపై లైంగికదాడులు జరుగుతున్న పట్టించుకోవడంలేదన్నారు. బిల్కిస్ బానో నిందితులను మాత్రం నిస్సిగ్గుగా విడుదల చేసి వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత గౌరవముందో అర్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు ఉజ్జిని హరినాథ్ రావు , రాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా నాయకులు చిగురు వెంకటేష్, చంద్రయ్య, రాము, స్వామి, సుధాకర్, ఇమామ్ పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కాసోజు నాగజ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబరాలు అని, బతకమ్మ పాటలే ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, మహిళా సమాఖ్య నాయకులు మహాలక్ష్మి, రొయ్యల గిరిజ, మాధవి, సుజాత, మణెమ్మ, నాయకులు శరణ్య, శృతి, ప్రత్యూష, శారద, తదితరులు పాల్గొన్నారు.