Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోటగడ్డ శ్రీనివాస్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరాటే క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని కుత్బుల్లాపూర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కోటగడ్డ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీలోని రిచ్ మైండ్స్ స్కూల్లో కరాటే కోచ్ అక్బర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై కరాటేలో ప్రావీణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలో విధిగా కరాటేను తప్పనిసరి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రిచ్ మైండ్ స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బిలాల్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ట్రెజరర్ పోలేపల్లి శేషారెడ్డి పాల్గొన్నారు.