Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంజరి సంఘం మాజీ అధ్యక్షుడు వంజరి ముత్తయ్య
నవతెలంగాణ-ఓయూ
సీనియర్ సిటీజన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని వంజరి సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు వంజరి.ముత్తయ్య కోరారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం లాలాపేట్‌లో 80 ఏండ్లు దాటిన వారిని సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, కుటుంబసభ్యులు, సమాజం సీనియర్ సిటీజన్లను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని కోరారు. బస్సు, రైల్వేలలో, మెడిసిన్లలో రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అంతకుమందు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పి.దేవా నందు, ఎంపీ కృష్ణ రావు, అనిల్ కుమార్ వంజరి, అమర్నాథ్, ఆంజనేయులు, హనుమంతరావు, పెంటయ్య, కెఎన్ మదన్ మోహన్, హనుమంతరావు, రాం చందర్, సూరి, దేవనంద్ పాల్గొన్నారు.