Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
సుల్తాన్షాహి శ్రీ జగదాంబ ఆలయం వద్ద జరిగిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 500 మందికి పైగా స్థానికులు వైద్య సేవలు పొంది ఉచితంగా మందులు పొందారు. అంతకుముందు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం సత్య ప్రకాష్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈవైద్య శిబిరం కొనసాగింది. ఇందులో భాగంగా చెవు, ముక్కు, గొంతు, కంటి, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, న్యూరో స్పెషలిస్ట్ తదితర వైద్యులు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, డయాబెటిక్ పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో రాకేష్ తివారితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.