Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టాటా కన్స్యూమర్ సోల్‌ఫుల్ ప్రొడక్ట్స్(టీసీపీ) నుంచి చిన్నారులు, పెద్దల కోసం మిల్లెట్ మ్యుస్లీని తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ న్యూట్రిసెరల్ కన్వెన్షన్ 4.0 వద్ద ఆ సంస్థ విడుదల చేసింది. ఈ మిల్లెట్ మ్యుస్లీలో 25శాతం తృణధాన్యలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు ఉంటాయని తెలిపింది. అంతేగాక ఇది వినియోగదారులకు మెరుగైన ఆరోగ్యం అందించడంతో పాటుగా రుచిని సైతం అందిస్తుందని పేర్కొంది. టాటా కన్స్యూమర్ సోల్‌ఫుల్ సీఎండీ ప్రశాంత్ పరమేశ్వరన్ మాట్లాడుతూ నేషనల్ న్యూట్రిసెరల్ కన్వెన్షన్ సదుస్సులో తమ సంస్థకు పోషక్ అనాజ్ అవార్డు-2022 సైతం వరించిందని తెలిపారు. వినియోగదారులకు అత్యున్నత నాణ్యత, ఆరోగ్యవంతమైన తృణధాన్యాల ఆధారిత ఉత్పత్తులను అందించడానికి కట్టుబడి ఉన్నామనీ, 2023ను అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన వేళ ఓ బ్రాండ్‌గా రుచికరమైన మిల్లెట్ ఆధారిత ఉత్సత్తుల ఆవిష్కరణకు కృషి చేయనున్నామని ఆయన తెలిపారు.