Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది పనితీరు తెలుసుకోవడానికి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, పీహెచ్సీ సిబ్బందితో సంభాషించి, జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమం నవీకరణ పనులను పర్యవేక్షించారు హాజరు, అవుట్షెంట్, ఇన్పేషెంట్, స్టాక్ గర్భిణీ స్త్రీల నమోదు, ఇమ్యునైజేషన్, ఫార్మసీ మరియు ల్యాబ్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీచేశారు. డా పుట్ల శ్రీనివాస్ కానుపు అయి పోస్ట్ డెలివరీ కేసుతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకొని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య అధికారి, సిబ్బంది పనితనం సంతృప్తిగా ఉందిఅని కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్లు, పారామెడికల్, మినిస్టీరియల్, నర్సింగ్, ఫీల్డ్ స్టాఫ్ ఆశాలు అందరూ సమాజానికి నిస్వార్థ సేవకు అంకితమవ్వాలని, తమ విధుల పట్ల విశ్వాసం, క్రమశిక్షణ మరియు అంకితభావంతో గౌరవనీయ ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ ఆదేశాల మేరుకు ఆరోగ్య తెలంగాణ దిశగా అందరు పనిచేస్తూ ముందుకు సాగాలని డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు.