Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లో స్వచ్ఛభారత్ కార్యక్ర మంలో భాగంగా శనివారం జీహెచ్ఎంసి మరియు రాంకీసంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో డివిజన్లో ఆయా కాలనీలో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలు, తొలగించిన చెట్ల కొమ్మలను తరలించేం దుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాంకీ సంస్థ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ సుధాకర్ ,సర్కిల్ ఇంచార్జ్ రమేష్ ,వార్డు ఇన్చార్జి కవిత ,మరియు సిబ్బంది, నాయకులు రాఘవాచారి సాయిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.