Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ
నవతెలంగాణ - కూకట్పల్లి
తెలంగాణ ఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పర్వదినం అని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ అన్నారుó. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసివనం అపార్ట్మెంట్స్ లో అవని స్వచ్ఛంద ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సత్తూర్ శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ స్థానిక మహిళా సోదరీమణులతో కలిసి బతుకమ్మ వేడుకలలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రపంచంలో పూలతో దేవుడిని పూజిస్తారు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ పూలనే దేవతగా పూజించే ఘన చరిత్ర మన తెలంగాణ ప్రత్యేకం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మన తెలంగాణ ఆచార, సంస్కతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యా నికి ప్రతీక. మన అడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల వేడుక. పూలను పూజిస్తూ, గౌరమ్మను ఆరాధిస్తూ మహిళల అత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుక మ్మను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని పేర్కొన్నారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, టీఆర్ఎస్ నాయకులు కాశినాథ్ యాదవ్, పోశెట్టి గౌడ్, సత్తుర్ శిరీష, రాజ్యాలక్ష్మి, కుమారి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.