Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
ఉచిత విద్యుత్‌ను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు కోరారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్ఆర్ఎస్) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్ అధ్యక్షతన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొ రేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షు లు గోపి రజక మాట్లాడుతూ ప్రభుత్వం రజకుల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకం నీరుగారిపో తుందన్నారు. రజక వృత్తిదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని జీవో జారీ చేసిన విషయం అందరికీ తెలిసినదే అనీ, ఈ పథకం అమలులోకి వచ్చేసరికి క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉందన్నారు. నెల రోజులు మాత్రం ఎలాంటి విద్యుత్ బిల్లులు రాలేదనీ, రెండో నెల గడిచెసరికి అనేక ల్యాండ్రీ షాపులకు విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఉచితం అనుకున్న కరంట్ కాస్త భారం కావడ ంతో రజకులు అయోమయంలో పడ్డారని తెలిపారు. ఇలాంటి చౌక బారు హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమౌతున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ది చెప్తామన్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యూత్ అధ్యక్షులుగా ఎర్రొల్ల కన్నయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శిగా చౌలపల్లి ఆనంద్, దమ్మాయిగూడ మున్సి పాలిటీ అధ్యక్షులుగా జల్ల నర్సింహ, ఉపాధ్యక్షులుగా పడకంటి రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్ప జెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని తెలి పారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బేగంపేట నర్సింహ, యూత్ కార్యదర్శి కొండ్రాతి రమేష్, జిల్లా కార్యదర్శి ఓరుగంటి రాజ్ కుమార్, కాప్రా మండల అధ్యక్షులు కొత్తపేట క్రాంతి, ఉపాధ్యక్షులు మచ్చ అశోక్, శేఖర్, ఎ.బాల్ నర్సయ్య, గజం బాల్ రాజ్ పాల్గొన్నారు.