Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మహాత్మాగాంధీ చూపిన బాటలో పయనించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానా యక్ అన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని శామీర్పేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గాంధీజీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సంద ర్భంగా లింగ్యానాయక్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం గాంధీజీ సత్యం, అహింస వంటి మార్గాలను ఎంచుకు న్నారనీ, ప్రతి ఒక్కరూ మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా యువజన, క్రీడల అధికారి బల్రామ్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.