Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలో రాంకీ సంస్థ ఆధ్వర్యంలో మాస్ క్లీనింగ్ చేపట్టి కాలనీల్లో, ఖాళీ స్థలాల్లో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ మాస్ క్లీనింగ్ ద్వారా డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో చాలా రోజులు గా పేరుకుపోయిన, వర్షాల కారణంగా నిలిచిపోయిన చెత్తనంతా పూర్తిగా తొలగించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం రాంకీ సంస్థ వారి ద్వారా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంకీ సంస్థ ఎల్బీ నగర్ జోనల్ హెడ్ రావులపల్లి సుధాకర్, కాప్రా సర్కిల్ సీఐ అమానుల్ల ఖాన్, జవాన్ యాదగిరి, స్థానిక నాయకులు శేఖర్ గౌడ్, దండెం నరేందర్, తదితరులు పాల్గొన్నారు.