Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీటీడీ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరావు
నవతెలంగాణ-కూకట్ పల్లి
ఆలయాల అభివృద్ధిలో అర్చకుల పాత్ర ప్రధానమైన దని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. శేరిలిం గంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలోని సాయిబాబా ఆలయంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా దేవి శరన్నవరాత్రుల పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం ఆవరణలో అర్చకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శాశ్వత వసతి గృహాలు, వంటశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు అభివృద్ధి చెందాలంటే అర్చకుల పాత్ర ప్రధానమైనదన్నారు. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు ఆలయాల్లో అర్చకులు నిత్యం సేవలు అందిస్తున్నారని కొనియాడారు.