Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-కాప్రా
కేరళ మాజీ హౌం మంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు కె.బాలకృష్ణన్ ఆకస్మిక మరణానికి విచారిస్తూ సీపీఐ(ఎం) పార్టీ ఆఫీసు ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ బాలకృష్ణన్‌తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఆయన చనిపోవడం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు తీరని లోటన్నారు. కేరళలో మాస్ లీడర్‌గా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. కేరళలో మతోన్మాద శక్తులను ఎదుర్కోవడంలో, వాటిని పెరగకుండా నిలువరించ డంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. అనేక సార్లు మతోన్మాదుల దాడులకు కూడా గురయ్యారని తెలిపారు. మొక్కవోని ధైర్యంతో కేరళలో పార్టీని ముందుకు నడిపించారని చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం, పార్టీ కేరళ కామ్రేడ్ సంతోష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉదరు రాధాకృష్ణన్, యాదయ్య, పి.వెంకట్, యాదగిరి రావు, చంద్రశేఖర్, కృష్ణానాయక్, అశోక్, బాలు నాయక్, లింగస్వామి, సఫియా, శోభ, రాజశేఖర్, ఎం.వినోద, సబిత, ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) నాయకులు, తదితరులు పాల్గొన్నారు.