Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, మాజీఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ-తుర్కయాంజల్
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) ఐదవ మహాసభ డిసెంబర్లో జరుగను న్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తుర్కయాంజల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో మహాసభ సన్నాహక సమావేశం టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బింగి రాములయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హాజరై మాట్లాడుతూ పేద వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర దాగున్న ఎన్ఈసీ 2020ని రద్దు చేయాలని, అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కారణంగా చదువులు వెనుకబడిపోయాయని, ఆ గ్యాపును పూర్తి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. డిసెంబర్లో జరుగనున్న టీఎస్ యూటీఎఫ్ మహాసభలో విద్యారంగంపై సమగ్రమైన చర్చ జరిపి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. అనంతరం ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, గౌరవ అధ్యక్షులుగా చుక్కా రామయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ.గాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎమ్.వెంకటప్ప, కోశాధికారిగా బి. రాములయ్య ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, సీహెచ్ రవి, వీఓటీటీ ప్రధాన సంపాదకులు మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కపేష్, టీపీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్, టీఎస్ యూటీఎఫ్ నాయకులు కె.గోపాల్ నాయక్, ఎన్.కల్పన, పి.జగన్నాథం, ఎ. నాగేంద్రం, రఘుపాల్, కె.వెంకటయ్య, శివారెడ్డి, బి.బుగ్గరాములు, బి.గణేష్, వై.రామకృష్ణ, కిషన్ చౌహన్, సుగంధ పాల్గొన్నారు.