Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-తుర్కయాంజల్
దళితులకు అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి చేతుల మీదగా ఆదివారం దళిత బంధు యూనిట్ల ప్రారంభోత్సవాలు చేశారు. మునగనూర్ లోని 15వ వార్డుకి చెందిన దోమలపల్లి ప్రశాంత్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన టెంట్ హౌస్ మునగనూర్‌లోని 1వ వార్డుకి చెందిన ''చిరుతోటి మణిబాబుకు మంజూరైన సెంట్రింగ్ మెటీరియల్స్‌ను మరియు కోహెడకి చెందిన శీలం నాగరాజుకు మంజూరైన ఫ్లవర్ డెకరేషన్ షాపును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ...దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని, దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకమని, యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ లబ్ధిదారులు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సతయ్య, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ కందాడ ముత్యం రెడ్డి,టీఆర్ఎస్ నాయకులు నోముల కృష్ణాగౌడ్, ఎఫ్ఎస్సిఎస్ బ్యాంక్ డైరెక్టర్ సామ సంజీవ రెడ్డి, కౌన్సిలర్లు స్వాతి అమరేందర్ రెడ్డి, సంగీత మోహన్‌గుప్తా, సిద్దాల జ్యోతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు కొండూరి వెంకటేష్, ప్రభువర్ధన్, సంపతీశ్వర్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, రమేష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ కురుమ, బాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.