Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచడం ద్వారా గిరిజన, సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత కేసీఆర్ సర్కాకే దక్కిందని టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ భూక్యా సుమన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన రిజర్వేషన్ల పెంపును స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిం చారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. గిరిజన ప్రజలు ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు పెంచిన రిజర్వేషన్లు అక్కరకు వస్తాయని తెలిపారు.
కార్పొరేటర్ భూక్య సుమన్ నాయక్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి గిరిజన రిజర్వేషన్లు పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు దొంతబోయిన మహేశ్వరి, బొమ్మకు సుగుణ, పద్మారెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, కాటపల్లి రాంచంద్రారెడ్డి, జె.రాములు, మీసాల కృష్ణా, పీవీ సురేష్, మోతే రాజు, బంజార సేవా సంఘం నాయకులు ధర్నా నాయక్, రవీందర్ నాయక్, సాంబయ్య నాయక్, బిక్షపతి నాయక్, మునీశ్వర్ నాయక్, మాన్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.