Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కెేవీపీఎస్ 24వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం ఆదివారం దిల్సుఖ్నగర్లోని బోడిపూడి వెంకటేశ్వరరావు స్మారక కేంద్రంలో రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్, రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్ హాజరై ప్రసంగించారు .ఆత్మగౌరవం, సమానత్వం కుల నిర్మూలన లక్ష్యసాధనకై అక్టోబర్ 2, 1998 గాంధీ జయంతి రోజు ఏర్పడింది. ఆనాటి నుండి రాష్ట్రంలోని దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష రూపాలను వెలికితీసి కులనిర్మూలన అంతం చేయాలని కేవీపీిఎస్ నిరంతరం పోరాటం చేస్తూ వస్తుంది. కేవీపీఎస్ సామాజిక సంఘాలను కలుపుకొని పోరాటాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ చట్టం దళితులు చనిపోతే పూడ్చటానికి బొందలగడ్డ స్మశాన వాటిక స్థలం పోరాడి జీవో నంబర్ 12:35 ఉచిత విద్యుత్తు జీవో నెంబర్ 342, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు 2 లక్షల 50 వేలు ఆర్థిక సాయం కొరకు జీవో నెంబర్ 12 సాధించుకోవడం జరిగింది.. రాష్ట్రమంతట కులాంతర వ్యవహారాల హత్యలు ఎక్కడ జరిగిన కేవీపీఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి బాధితుల వైపు నుండి న్యాయం జరిగే వరకూ కృషి చేశారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ కెవిపిఎస్ కార్యదర్శి మేకల కృష్ణ, సిహెచ్ వెంకన్న, ఎం.వీరయ్య, సిహెచ్. మల్లేష్ పాల్గొన్నారు.