Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్జీ, గోద్రేజ్, వల్పూల్, శాంసంగ్ వంటి పేర్లతో బురడీ
- 30 నుంచి 40 శాతం అధికంగా వసూల్లు వివరాలు వెల్లడించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నకిలీ కస్టమర్ కేర్ కాల్ సెంటర్ పేరుతో జరుగు తున్న మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 555 సెల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీలు కార్తికేయ, గజారావు భూపాల్ వివరాలను వెల్లడించారు. రామంతా పూర్‌కు చెందిన మహ్మద్ సలీమ్, మహ్మద్ ఆరీఫ్ ఎక్కువ లైక్స్ రావాలని గూగుల్ యాడ్స్‌లో నకిలీ కస్టమర్ కాల్ సెంటర్‌ను సృష్టించారు. హైదరాబాద్‌తోపాటు, ముంబై, నోయిడా, వైజాగ్, బెంగళూర్ని పలు రాష్ట్రాల్లో కనబడేలా అప్లోడ్ చేశాడు. దాదాపు 20 నుంచి 30 మందిని ఎంపిక చేసుకుని నకిలీ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. శాంసంగ్, ఎల్జీ, గోద్రేజ్, వల్పూల్ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన కాల్ సెంటర్‌గా నమ్మిస్తున్నారు. ఫ్రిజ్, కూలర్, టీవీతోపాటు ఎలాంటి సర్విస్ అవసరమైనా వెంటనే చేస్తామంటూ గూగుల్‌లో యాడ్‌ను వైరల్ చేశారు. ప్రముఖ సంస్థలకు చెందిన కస్టమర్లు ఫోన్ల్ చేస్తే వారి వస్తువులను సర్విస్ చేస్తున్నారు. అందుకు 30 నుంచి 40 శాతం వరకు అధికంగా డబ్బులను వసూలు చేస్తు న్నారు. ప్రతిరోజు దాదాపు రూ.5 లక్షలకుపైగా సంపాది స్తున్నారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ సమావేశంతో అదనపు డీసీపీ చక్రవర్తి, ఏసీపీ కేవీఎం ప్రసాద్, సీఐ దసృ, పోలీస్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.