Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితుల అరెస్టు
- రూ.75 లక్షల విలువగల 500కిలోల దుంగల స్వాధీనం
- వివరాలు వెల్లడించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ఎర్రచందనం విక్రయించేందుకు ప్రయత్నిం చిన నలుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.75లక్షల విలువ గల 500 కిలోల దుంగలను స్వాధీనం చేసుకు న్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం జాయిం ట్ సీపీలు కార్తికేయ, గజారావు భూపాల్, అదనపు డీసీపీ చక్రవర్తి, ఏసీపీ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ప్రొద్దు టూర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా ఐస్‌క్రీమ్‌ల వ్యాపారం చేసే వాడు. అందులో నష్టాలు రావడంతో రవిచంద్ర అనే స్మగ్లర్ తో చేతులు కలిపాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఖాన్, అబ్దుల్లా ఖదీర్‌తో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టాడు. కల్వకుర్తిలో ఓ గోదాంను ఏర్పాటు చేసు కుని అక్కడ్ ఎర్రచందనాన్ని డంప్ చేస్తున్నారు. సమాచా రం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు కంచన్‌బాగ్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. ఈ సమావేశంలో కంచన్‌బాగ్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులతోపాటు తదితరులు పాల్గొన్నారు.