Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
యువత రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలని కీసర మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు మొరుగు రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం కీసరలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు ఉద్దమర్రి సోమయ్య నూతనంగా ఏర్పాటు చేసిన జై మాత రియల్ ఎస్టేట్ కార్యాలయంను రవీందర్ ప్రారంభించి మాట్లాడారు. నేడు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి యువత ఎదుగుతున్నారని తెలిపారు. పేద ప్రజలకు అందుబా టులో ఉండేలా సొంత ఇంటి కల నెరవేరేలా ప్లాట్ల ధరలు, ఇండ్ల ధరలు, భూముల ధరలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కీసరలో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందనీ, దీన్ని కీసర యువకులు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు మొరుగు రవీందర్, ప్రధాన కార్యదర్శి దాయర శ్రీనివాస్, యాద్గార్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దాయర శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు చినింగని మల్లేష్, నాయకుల పుండ్రు మల్లేష్, భూపాల్, యాద్గార్పల్లి వార్డు సభ్యులు ప్రభాకర్, నాయకులు కాగ్ కలురాం చౌదరి, కుమ్మరి సత్తయ్య, ముద్దం చంద్రయ్య, ఉద్ద మర్రి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.