Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
రాష్ట్రంలోని క్రైస్తవులను సంఘటితం చేయడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి మద్దతు పలికేందుకు ఈనెల 6వ తేదీన తెలంగాణ క్రైస్తవ నాయకుల మహాసభను హరిహర కళాభవన్లో నిర్వహిం చనున్నట్టు బిషప్ ఎం.భాస్కర్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహాసభకు సంబంధించిన పోస్టర్ను రెవరెండ్ సామల జోసెఫ్,బిషప్ ధనరాజ్ కోట తదితరతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న నామినేటెడ్ పోస్టులు స్వచ్ఛమైన క్రైస్తవులకే ఇవ్వాలనీ, గ్రామాలలో క్రైస్తవులపై దాడులను అరికట్టాలనీ, పాస్టర్లకు సైతం గౌరవ వేతనాలు అందించాలనీ, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.