Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటన చేయనున్న నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా సంబురాలు నిర్వహించాలని ఎమ్మెల్యే జి. సాయ న్న కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళ వారం మారేడ్పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మారేడ్పల్లి మండల పరిధిలోని దాదాపు 422 మందికి నూతన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే జి.సాయన్న డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె నివేదిత, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ మెంబర్స్ నళిని కిరణ్, పాండు యాదవ్, మార్కెట్ మాజీ చైర్మెన్ టీఎం శ్రీనివాస్ ముదిరాజ్, సదానంద్ గౌడ్, పి.సంతోష్, నాగినేని సరిత, శ్రీకాంత్, పెద్ద నరసింహ యాదవ్ పాల్గొన్నారు.