Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై ఉద్యమిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.యూసుఫ్ తెలిపారు. ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా మొదటి సమావేశం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశం ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కె.స్వామి అధ్యక్షతన జరగ్గా.. ఎండీ.యూసుఫ్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను అనుసరిస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టాలను రూపొందిస్తున్నా దన్నారు. ఒక వైపు దేశ స్థూల జాతీయ ఉత్పత్తి శాతం రోజురోజుకూ తగ్గుతున్నా, మోడీ అవేమీ పట్టనట్టు ఆర్ధిక వ్యవస్థను దివాళా తీసే పోకడలను అనుసరించడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయ వాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభలకు మేడ్చ ల్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మిక వర్గం హాజరు కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. నవంబర్ 6,7,8 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు యాదాద్రిలోని యాదగిరిగుట్టలో జరిగనున్నాయనీ, ఈ మహాసభల సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని అన్ని పారిశ్రామిక వాడల్లో విస్తతంగా ప్రచారం, ప్రదర్శనలు నిర్వహించి మేడ్చల్ జిల్లా నుంచి 1000 మందిని తరలించనున్నట్టు వారు తెలిపా రు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవి చంద్రన్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కల్లూరి జయచంద్ర, జిల్లా సలహాదారు ఎస్.శంకర్ రావు, ఉమా మహేష్, ఏసురత్నం, నేతలు సహదేవ్, పరమేశ్వర్, భిక్షపతి, స్వామి దాస్, జాన్, రమేష్, శ్రీను. రమేష్ సింగ్, నర్సింగ్రావ్, తులసితో పాటు 50 మంది కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.