Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట/జూబ్లీహిల్స్
అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని ఊరేగింపుగా బుర్జుగల్లీలోని ఆలయానికి తీసుకువచ్చి జమ్మిపూజ నిర్వహించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణదహనం కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, కార్పొరేటర్లు ఇ.విజయకుమార్‌గౌడ్, బి.పద్మవెంకటరెడ్డి, వై.అమృత, మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్‌గౌడ్, పద్మావతి డిపిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రాజమండ్రి నుంచి వచ్చిన వాసు బృందం చేసిన బాణాసంచా షో వీక్షకులకు కనువిందు చేసింది. దేవస్థాన సేవా సమితి సభ్యులు జనగం సత్తిబాబుగౌడ్, పంజాల చంద్రశేఖర్‌గౌడ్, మోర శ్రీరాములు ముదిరాజ్, గడ్డం శ్రీధర్‌గౌడ్, చెంగలి సుధాకర్, వెదిరె మహేందర్‌రెడ్డి, నాయకులు గౌతంరావు, ఆర్.లక్ష్మణ్ యాదవ్, ఎడెల్లి అజరు, కృష్ణగౌడ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, అనంద్‌గౌడ్, మోర పాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లకుంట న్యూ రామాలయంలో నిర్వహించిన జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, కార్పొరేటర్ అమత తదితర నాయకులు పాల్గొన్నారు.
కృష్ణకాంత్ పార్క్ వద్ద రావణ దహనకాండ
విజయదశమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ, రహమత్ నగర్, వెంగల్రావు నగర్ డివిజన్లలో రావణ దహన కాండ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానిక కార్పొరేటర్లు దేదీప్య, రాజ్ కుమార్ పటేల్, సీఎన్ రెడ్డితో కలిసి భారీ ఊరేగింపుగా కృష్ణకాంత్ పార్కు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా ఉత్సవాలు చూడాలంటే కృష్ణకాంత్ పార్క్ వద్దకే రావాలని అనుకున్నట్లుగా వేల మంది ఇక్కడికి తరలి వచ్చారన్నారు. వచ్చే దసరా పండుగకు కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఇప్పటికంటే ఎక్కువగా ఏర్పాట్లు చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ అధ్యక్షుడు అప్పు ఖాన్, డివిజన్ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.